సినిమాల్లో చేసే క్యారెక్టర్లకి బయట ప్రభాస్ వ్యక్తిత్వానికి అసలు సంబంధమే ఉండదు. అసలు తాను ఇండియాలోనే పెద్ద స్టార్ అనే ఫీలింగ్ కూడా ప్రభాస్‌లో కనిపించదు. అందుకే ఫ్యాన్స్ సహా సెలబ్రెటీలు కూడా ప్రభాస్‌ను డార్లింగ్ అని పిలుస్తుంటారు.హీరోయిన్ హంస నందిని తనకి ప్రభాస్‌కి మధ్య జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పింది. మిర్చి సినిమాలో 'మిర్చి లాంటి కుర్రాడు' పాటకి హంస నందినితో కలిసి ప్రభాస్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సమయంలో ప్రభాస్ చేసిన ఓ పని గురించి హంస చెప్పుకొచ్చింది."ప్రభాస్‌కి చాలా సిగ్గు. మిర్చి తర్వాత మేము ఒక పార్టీలో కలిశాం. అయితే మిర్చి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆడియో రిలీజ్‌కి కానీ ఫంక్షన్స్‌కి కానీ అందుబాటులో లేను. ఓ పార్టీలో కలిశాను. నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా అని ప్రభాస్ అడిగాడు. లేదు నేను సినిమా కూడా చూడేదు అని చెప్పా. దీంతో వెంటనే దగ్గరలోని థియేటర్లో మిర్చి మూవీకి టికెట్ బుక్ చేసి వెంటనే వెళ్లి చూడమని చెప్పాడు. పైగా సినిమాలో నా సాంగ్ ఎప్పుడొస్తుందో ఆ టైమ్ కూడా చెప్పాడు. ప్రభాస్ చాలా స్వీట్" అంటూ హంస నందిని చెప్పింది.