Current Date: 02 Apr, 2025

యాంకర్ విష్ణు ప్రియపై పోలీసులు సీరియస్.. ఫోన్ సీజ్

యాంకర్ విష్ణుప్రియపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన కేసులో ఇటీవల విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ.. ఆ నోటీసుల్లో పేర్కొన తేదీన విచారణకి విష్ణుప్రియ హాజరు కాలేదు.విచారణ రోజు కాకుండా.. సహేతుకమైన కారణం చెప్పకుండా గడువు ముగిసిన తర్వాత లాయర్‌ను వెంటబెట్టుకొని విచారణకు విష్ణుప్రియ వెళ్లింది. దాంతో 3 గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ వీడియోలు చూపించి ‘ఇందులో ఉన్నది మీరేనా..’ అని ప్రశ్నించారు. మొత్తంగా 12-15 బెట్టింగ్ యాప్స్‌కు ఆమె ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.ప్రమోషనల్ వీడియోకు ఎంత తీసుకున్నారు? డబ్బులు ఎలా చెల్లించారు? దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్ మెంట్స్‌ను కూడా పోలీసులు తీసుకున్నారు. ఈ వీడియోలన్నీ మొబైల్ నుంచే అప్ లోడ్ చేసిందని తేలడంతో ఫోన్‌ను సీజ్ చేశారు.

Share