గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ గొప్ప మనసు చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి చికిత్సకు సాయం చేశారు. పుట్టుకతోనే పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతూ ప్రాణాపాయంలో ఉన్న ఓ చిన్నారికి 53 రోజుల పాటు చికిత్సకు చెర్రీ సాయం అందించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫొటో జర్నలిస్టు దంపతులకు పుట్టిన చిన్నారికి గుండెలో సమస్య ఉందని, బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో దంపతులు తమ పాపను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సమాచారం చరణ్‌కు తెలియడంతో చిన్నారికి 53 రోజుల పాటు చికిత్స అందించేందుకు సాయం చేశారు. ఇక చికిత్సలో భాగంగా ప్లేట్‌లెట్లు, రక్తం వంటివి చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి అందించారు. సమయానికి వైద్యం అందడం, పాప కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు.