కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్, నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు వీరిద్దరూ హాజరై, ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్న తరుణంలో, ఈ వేడుకలో వారు కలిసి కనిపించడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. నిజానికి, వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ నేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. విజయ్ తన సొంత కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని, ముందుగా త్రిష ఇంటి నుండి బయటకు రావాలంటూ ఆయన నేరుగా విమర్శలు చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ వివాదం సర్దుమణగక ముందే, విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం తమిళనాట కలకలం సృష్టించింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నారని, అందుకే తనకు విడాకులు కావాలంటూ సంగీత తన పిటిషన్లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో త్రిష పేరే ప్రధానంగా వినిపించింది. అయితే, ఈ ఆరోపణలు, విడాకుల పిటిషన్ వార్తల నేపథ్యంలో.. విజయ్, త్రిష కలిసి ఒకే వేదికపై బహిరంగంగా కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం స్నేహపూర్వక పలకరింపా లేక రూమర్లకు వారు ఇస్తున్న సమాధానమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.