Current Date: 25 Nov, 2024

తెలుగు హీరోయిన్‌ని బాధపెట్టిన లేడీ జర్నలిస్ట్ ప్రశ్న మరీ ఇంత నీచమా?

తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఇన్నాళ్లు చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంటూ ఒక స్థాయికి చేరుకుంది. తాజాగా ఈమె పొట్టేల్ సినిమాలో నటించింది.పొట్టేల్‌ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్న అనన్య నాగళ్లకు ఇటీవల ఒక ప్రెస్‌ మీట్‌ లో లేడీ జర్నలిస్ట్‌ నుంచి కమిట్‌మెంట్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అంతా కమిట్‌మెంట్‌ ఇవ్వాలంట కదా, కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక రేటు, ఇవ్వకుంటే మరో రేటు ఇస్తారంట కదా అంటూ ఆ లేడీ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఆ సమయంలో అనన్య గట్టిగానే సమాధానం ఇచ్చి, ఆ లేడీ జర్నలిస్ట్‌ కి చెంప దెబ్బ కొట్టినట్లుగా కౌంటర్‌ ఇచ్చింది. అంతే కాకుండా ఆ ప్రశ్న వేసినందుకు ఆమెపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ ప్రశ్న అనన్య ను వెంటాడుతూనే ఉందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై స్పందించింది... ఇంట్లో చాలా కాలంగా నేను పోరు పెట్టి హీరోయిన్‌గా నటించేందుకు ఒప్పించాను. ప్రతి రోజు నేను బయటకు వస్తున్న సమయంలో అమ్మ ఏం అవుతుందో అనే భయంతో చూస్తూ ఉంటుంది. 

Share