Current Date: 04 Jul, 2024

కూటమిదే విజయం తేల్చి చెప్పిన ‘శాన్‌’ పోల్స్‌ సర్వే

ఏపీలో అధికారం దక్కేదెవరికి..జగన్‌ మరోసారి సీఎంగా కొనసాగుతారా? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. మే 13న పోలింగ్‌ జరిగినప్పటి నుంచీ ఒక్కటే ఉత్కంఠ. దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు వుంటాయని జగన్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. అదే సమయంలో మెజారిటీ సర్వేలు కూటమిదే విజయం అంటూ వెల్లడిరచాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై అనిశ్చిత ఏర్పడిరది. ఎవరికి వారు ఫిప్టీ ఫిఫ్టీ ఛాన్సు అనుకుంటూ క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు స్వదేశంలోను, విదేశంలోనూ తిరుగుతూ రెస్టు తీసుకుంటున్నారు. అమాయక ప్రజలు మాత్రం ఊపిరి బిగపెట్టుకొని ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శాన్‌’ పోల్స్‌ చేసిన ఎగ్జిట్ సర్వే వివరాలను ‘లీడర్‌’ అందించడానికి సిద్ధమైంది. ఇందులోని అన్ని అంశాలకూ ‘శాన్‌ పోల్స్‌’ మాత్రమే బాధ్యులు. ఈ సర్వే తో ‘లీడర్‌’కు ఎటువంటి సంబంధమూ లేదని పాఠకులకు తెలియజేస్తున్నాము. సెక్టార్‌ వారీగా పరిశీలనలు:71.4% మంది   ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి మేనిఫెస్టో అద్భుతంగా ఉందని 65.5% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. 66.8% మంది వ్యక్తులు పురోగతి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.62.6% మంది ఓటర్లు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారు.వైసీపీని వ్యతిరేకించడానికి ప్రభావిత చేసిన సమస్యలు ఇవే!1.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది? 2.కరెంట్‌ ఛార్జీలు ఎందుకు పెంచారు? 3.ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు అంతగా పెంచారు? 4.రాష్ట్రవ్యాప్తంగా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎందుకు ఎత్తివేశారు? 5.మద్య నిషేధం ఎక్కడ ఉంది? 58.4% మంది ప్రతివాదులు శాంతిభద్రతలు, పరిపాలన లోపించిందని అభిప్రాయపడ్డారు.