ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దురదృష్టం వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె జ్యూడీషియల్ రిమాండ్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈసారి జులై 18వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది.లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో కవితపై విధించిన జ్యూడిషయల్ రిమాండ్ నిన్నటితో ముగియగా.. తీహార్ జైలు అధికారులు ఆమెను వర్చువల్‌గా ట్రయల్ కోర్టు ముందు హాజరు పరిచారు. దీనిపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు జ్యూడీషియల్ కస్టడీని మరోసారి పెంచింది.బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించగా.. పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన కోర్టు చివరికి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఇటు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ.. అటు రిమాండ్ పెంపుతో ఇప్పట్లో కవిత బయటకు వచ్చేపరిస్థితి కనిపించట్లేదు.
Share