హీరోయిన్ కీర్తి సురేష్ తన నోటిదురుసుతో ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తెలిసి మాట్లాడుతుందో లేదా కావాలనే వివాదాల్లో వేలు పెడుతుందో అర్థం కావడం లేదు. కానీ చాలా పెద్ద హీరోల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కంటే తమిళ స్టార్ హీరో విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న కీర్తి సురేష్ ఈ వివాదం ముగిసింది అనుకునేలోపే మరో వివాదానికి తెర లేపింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా నేను చేయనని కీర్తి సురేష్ తేల్చి చెప్పేసింది. ‘‘కల్కి 2898 ఏడీ మూవీలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ నాకు కాల్ చేశారు. కానీ ఆ పాత్ర నేను చేయలేను అని సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత కొన్ని రోజులకి పశ్చాతాపంతో ఆ ప్రాజెక్టు లో భాగం కావాలని ఉంది అని నాగ్ అశ్విన్‌కి మెసేజ్ చేశాను. అప్పుడు బుజ్జికి వాయిస్ ఓవర్ అందించే ఛాన్స్ ఇచ్చాడు’’ అని కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సినిమా స్టార్టింగ్ లో దివ్య అనే గర్భిణీ పాత్రలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించింది.. ఆ పాత్రనే కీర్తి సురేష్ రిజెక్ట్ చేసి ఫీలవుతున్నట్లు ఉంది.