Current Date: 18 Jun, 2026

జనవాసాల్లోకి ‘దుప్పి’! .. ఫొటోల్లో బంధించిన స్థానికులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూన్ 18: జనావాసాల్లోకి అడివి జంతువులు వచ్చేస్తున్నాయి. వాటికి సరైనా ఆహారం దొరక్క కాంక్రీట్ జంగిల్‌లో అడుగిడుతున్నాయి. అసలే వర్షాకాలం..ఆపై వాహన రణగొనుల మధ్య అవి చిక్కుకునే ప్రమాదం ఉంది. గురువారం ఉదయం కైలాసగిరి పోలీస్ శాఖకు చెందిన పాత క్వార్టర్ల సమీపంలోని తుప్పల మధ్య ఒక దుప్పి కనిపించింది. దీంతో కొంతమంది వాటిని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. జూపార్కు, కంబాల కొండ సమీప అడవుల నుంచి రాత్రి వేళ దుప్పి నగరంలోకి ప్రవేశించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. జింకలు కూడా తమకు కనిపిస్తుంటాయని, అటవీశాఖ అధికారులు దృష్టి సారించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.