Current Date: 28 Nov, 2024

తమిళ్ హీరో ధనుష్‌తో విడాకులు తీసుకున్న రజినీకాంత్ కుమార్తె

తమిళ హీరో ధనుష్‌, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. అయినా.. ఇన్నాళ్లు మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని తేల్చి చెప్పేశారు. దాంతో న్యాయస్థానం ధనుష్‌-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ధనుష్‌.. ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్‌- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐశ్వర్య.. రజినీకాంత్‌తో కలిసి అతని ఇంట్లోనే పిల్లలతో ఉంటున్నారు. మరోవైపు ధనుష్ ఒంటరిగా ఉంటున్నాడు. అయితే.. ఇటీవల తమ పిల్లల స్కూల్ పంక్షన్‌లో మాత్రం ఇద్దరూ కలిసి కనిపించారు. ఇప్పుడు మళ్లీ విడిపోతూ కోర్టులో జంటగా కనిపించారు.

Share