Current Date: 27 Nov, 2024

రిటైర్మెంట్‌పై డేవిడ్ వార్నర్ యూటర్న్?

టీ20 ప్రపంచకప్‌ 2024తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని వార్నర్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.37 ఏళ్ల డేవిడ్‌ వార్నర్‌.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ 2024తో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది జనవరి 1న వన్డేలకు.. జనవరి 10న టెస్టులకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని అప్పుడే చెప్పాడు.కుటుంబానికి సమయం ఇవ్వాలని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్‌లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్నర్‌ చెప్పాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌తో అతడి అంతర్జాతీయ కెరీర్‌ ముగిసిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వార్నర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆస్ట్రేలియా సూపర్‌-8 దశ నుంచే నిష్క్రమించింది.

Share