Current Date: 27 Nov, 2024

పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానున్న లోకేష్

సాక్షి పై వేసిన పరునష్టం దావా కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టు కు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్షలండి’ పేరుతో సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సాక్షిపై వేసిన ప‌రువున‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జ‌ర‌గ‌నుంది. నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు లోకేష్ కోర్టుకు హాజరుకానున్నారు. 

Share