ఈసారి ఎన్నడూ లేని దూకుడు ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తుది మెట్టుపై బోల్తా పడడాన్ని ఆ జట్టు యజమాని కావ్యా మారన్ జీర్ణించుకోలేకపోయారు. పొంగుకొస్తున్న కన్నీటిని దాచుకోలేకపోయారు. కెమెరాల కంటబడకుండా వెనక్కి తిరిగి ఏడ్చేశారు. కన్నీటిని తుడుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. బాధను అదిమి పెడుతూనే విజేత జట్టుకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.