బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైంది. ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. దీనికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు సునాక్ అభినందనలు తెలిపారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి లేబర్ పార్టీ 368 సీట్లు కైవసం చేసుకోగా కన్జర్వేటివ్ పార్టీ 87 స్థానాల్లో గెలుపొందింది. లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. 14 ఏళ్ల తరవాత తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది.
Share