ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ సీన్ మీకు గుర్తుందా. కోర్టులో ఓ మహిళ పోలీసుకు పవన్ షేక్ హ్యాండ్ ఇస్తారు. అచ్చం అలాంటి సన్నివేశమే ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆవిష్కృతమైంది. స్పీకర్‌కి ధన్యవాదాలు తెలిపిన అనంతరం స్పీకర్ పక్కన నిల్చున్న సిబ్బందికి సైతం షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు కదులుతారు. దీంతో పవన్ రియల్ లైఫ్‌లోనూ రియల్ హీరో అని ఉప్పొంగిపోతున్నారు అభిమానాలు.