Current Date: 04 Jul, 2024

స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు - దేశ చరిత్రలోనే సంచలనం

 ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. పేదింటి మహిళకు సీఎం స్వయంగా పెన్షన్ అందచేయడం ఇదే ప్రథమం. సీఎం పర్యటనతో పెనుమాక వచ్చి అధికారులు పరిశీలించారు. ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో కలిపి జులై 1న రూ.7 వేలు పెన్షన్ అందించనున్నరు.

Share