క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించలేవని జడ్జి పేర్కొన్నారు. ఐఏఎస్‌లు అయినంత మాత్రాన స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని అభిప్రాయపడిరది. ముందు వెళ్లి ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇటీవల డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్.. డీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు.