Current Date: 27 Nov, 2024

వాలంటీర్ వ్యవస్థకి మంగళం జాగ్రత్తపడిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌‌లో వాలంటీర్ వ్యవస్థకి కూటమి ప్రభుత్వం మంగళం పాడేలా కనిపిస్తోంది. సామాజిక పింఛ‌న్ల‌ను గ‌తంలో మాదిరిగానే ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి పంపిణీ చేయాల‌ని కేటినెట్ నిర్ణయించింది. కానీ.. గ‌తంలో వాలంటీర్లు ప్ర‌తినెలా ఒక‌టో తేదీన పింఛ‌న్లు పంపిణీ చేసేవారు. ఈ ద‌ఫా స‌చివాల‌య ఉద్యోగుల‌తో పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో వాలంటీర్ వ్య‌వ‌స్థ కొన‌సాగ‌డంపై చ‌ర్చ మొద‌లైందివాస్తవానికి ఎన్నికల ముందు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించ‌డంతో పాటు ఇప్పుడిస్తున్న దాన్ని రెట్టింపు చేసి, అంటే నెల‌కు రూ.10 వేలు గౌర‌వ వేత‌నం ఇస్తామ‌ని చంద్ర‌బాబు గొప్ప‌గా చెప్పారు. కానీ చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత మొద‌టి కేబినెట్ స‌మావేశంలో వాలంటీర్స్ గురించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండానే ముగిసింది.

 

 

Share