Current Date: 04 Jul, 2024

ఫోన్ ట్యాపింగ్ కనిపెట్టచ్చు.. మీ ఫోన్‌ను చెక్ చేసుకోండిలా!

ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న అంశం. కేసీఆర్ హయాంలో కొందరు ప్రభుత్వ పెద్దల గైడెన్స్ మేరకు పలువురు పోలీసు అధికారులు.. విపక్ష నేతల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేశారనే అభియోగాలు ఉన్నాయి.

అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి ? అదెలా చేస్తారు ? మన ఫోన్ ట్యాపింగ్ బారినపడితే ఎలా గుర్తించాలి ? ఫోన్ కాలింగ్, ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడాన్నే ‘ఫోన్ ట్యాపింగ్’ అంటారు. ప్రత్యేకమైన డివైస్‌లను ఉపయోగించి ఇతరుల ఫోన్ సంభాషణలను వారికి తెలియకుండా వినడాన్నే ‘ఫోన్ ట్యాపింగ్’ అని చెప్పొచ్చు. అన్ని రకాల అధికారిక అనుమతులతో, ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వం సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేసింది.

ఫోన్ మాట్లాడేటప్పుడు వింత శబ్దాలు వినిపిస్తుంటే మీ ఫోన్ ట్యాప్ అయిందని అనుకోవచ్చు. ఫోన్ బ్యాటరీ సడెన్‌గా డౌన్ అయినా.. ఫోన్ అనుకోకుండా వేడెక్కినా సందేహించాలి. ఫోన్ సడెన్‌గా ఆఫ్ అయి ఆన్ అవుతూ ఉన్నా, మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్స్ మీ ఫోన్‌లోకి వచ్చిన జాగ్రత్తపడాలి. ఈ మధ్య కొన్ని ఫోన్లలో మైక్ ఆన్ అయితే ఫోన్ పైభాగంలో ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఫోన్‌లో మీరు మైక్ ఉపయోగించనప్పుడు కూడా అది వెలుగుతుంటే ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్నట్టు లెక్క