Current Date: 02 Apr, 2025

రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు.. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు నోటీసులు

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో మరో అడుగు ముందుకు పడింది. అప్పట్లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్‌ను విచారించేందుకు దర్యాప్తు అధికారి, ప్రకాశం ఎస్పీ దామోదర్ రెండ్రోజుల క్రితం నోటీసులు పంపారు. రఘురామరాజును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు సునీల్ నాయక్ కూడా వచ్చినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ఆయన పాత్రపైనా విచారించాలని నిర్ణయించిన అధికారులు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు.

Share