Current Date: 27 Nov, 2024

సింహగిరి ప్రదక్షిణకు వేళాయె

శతాబ్దాల చరిత్రకు, సనాతనమైన భారతీయ ఆధ్యాత్మిక వారసత్వ సంపదకు మకుటాయమానంగా విరాజిల్లుతున్న సింహాచలం క్షేత్రంలో   జరిగే వార్షిక ఉత్సవాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సింహగిరి ప్రదక్షిణ.   ఏటా ఆషాఢ పున్నమి నాడు స్వామివారికి ఆఖరు విడతగా శ్రీగంధం సమర్పణ చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగానే ముందురోజు అంటే చతుర్దశి నాడు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆచారం. 12వ శతాబ్దం నాటికే ఇక్కడ ప్రదక్షిణ ఉన్నట్టు శాసనం ద్వారం తెలుస్తోంది. 1242వ సంవత్సరంలో దీనిని గ్రామ ప్రదక్షిణంగా శాసనంలో పేర్కొన్నారు. అప్పట్లో అతి తక్కువ మంది భక్తులతో సాదాసీదాగా జరిగిపోయిన సింహగిరి ప్రదక్షిణం ఇప్పుడు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతోంది. సింహాచలేశునికి జరిగే ఉత్సవాలలో అత్యధికంగా భక్తులు హాజరయ్యే వేడుకగా సింహగిరి ప్రదక్షిణం మారిపోయింది. 2006 వ సంవత్సరం వరకు గిరి తిరిగి దర్శనానికి  వచ్చే భక్తులకు మాత్రమే కొండ పైనా దేవస్ధానం ఏర్పాట్లు చేసేది. ఏటేటా పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో  కొండచుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు కూడా సదుపాయాల కల్పించడంలో భాగంగా 2007లో అప్పటి ఈవో కె.రామచంద్రమోహన స్టాల్స్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 

Share