Current Date: 02 Jul, 2024

ట్రాఫిక్ పోలీసులకి ట్విస్ట్ ఇచ్చిన మందుబాబు బ్రీత్ ఎనలైజర్‌తో జంప్

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు ఝలక్ ఇచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బ్రీత్ ఎనలైజర్ ఊదరా బాబూ అంటే పోలీసులకు రివర్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అర్ధరాత్రి దాటాక ట్రాఫిక్‌ పోలీసులు నగరంలోని పుల్లారెడ్డి బంగ్లా దాటిన తర్వాత వచ్చే ట్రాఫిక్‌ పాయింట్‌ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అదే సమయంలో వర్షం పడుతోందికారును కానిస్టేబుల్‌ మహేందర్‌ ఆపి డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తిని పరీక్షించేందుకు బ్రీత్‌ ఎనలైజర్‌ బయటకు తీశారు ఊదమని అతడికి చెప్పగా అతడు ఊదినట్లే నటించాడు. అందరికీ ట్విస్ట్ ఇస్తూకానిస్టేబుల్‌ చేతిలో ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని కారుతో సహా అక్కడి నుంచి ఉడాయించాడు ఆ వ్యక్తి.వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు కారును వెంబడించినా దొరకలేదు. అర్థరాత్రి కావడం, పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో పాటుగా వర్షం కురుస్తుండడంతో ఆ కారును పట్టుకోలేకపోయారు. కారును డ్రైవర్ అతి వేగంగా తీసుకెళ్లడంతో నంబరును గుర్తించలేకపోయామంటున్నారు పోలీసులు.

Share