Current Date: 04 Jul, 2024

ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి.. I-PAC స్పెష‌ల్ ట్వీట్‌..

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ ఊహించ‌ని విధంగా చ‌తికిల ప‌డింది. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌తో ప్ర‌భంజ‌నం సృష్టించిన ఆ పార్టీ ఈసారి మాత్రం 11 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. అటు లోక్‌స‌భ స్థానాల్లోనూ ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. కేవ‌లం 4 చోట్ల మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఇలా ఊహించ‌ని ఫ‌లితాలతో వైసీపీ కుదేలైంది.  
ఇక ఎన్నిక‌ల‌ ఫలితాలు వెలువ‌డిన వేళ  I-PAC టీమ్ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ ఓ ట్వీట్ చేసింది. 2024 ఏపీ ఎన్నిక‌లు వైఎస్ఆర్‌సీపీతో మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసేలా చేశాయి.  I-PAC మ‌రియు దాని నిపుణులంద‌రు క‌లిసి ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డాం. ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వం అంద‌రికీ స్ఫూర్తి. మాపై ఆయ‌న న‌మ్మ‌కం ఉంచినందుకు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు" అని త‌న ట్వీట్‌లో పేర్కొంది.