Current Date: 04 Jul, 2024

పిన్నెల్లి తప్పించుకుపోయాడా?

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై ఇటు ఏపీ పోలీసులు గాని, అటు తెలంగాణ పోలీసులు గాని క్లారిటీ ఇవ్వడం లేదు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ సమీపంలో పోలీసులకు ఎమ్మెల్యే పిన్నెల్లి చిక్కినట్టే చిక్కి తప్పించుకొని పారిపోయాడంటూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెబుతున్నారు.  తమ పరిధిలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్‌ చేయలేదంటూ ఆయన అంటున్నారు.మరోవైపు పిన్నెల్లిని పట్టుకునేందుకు ఏపీ పోలీసులు జల్లెడ పట్టి వెతుకుతున్నారు. హైదరాబాద్‌, సంగారెడ్డి పరిసరాల్లో అణువణువూ గాలిస్తున్నారు. సంగారెడ్డి సమీపంలోని కంగ్టి వద్ద పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి కారు డ్రైవర్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు.