విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చ ర్యానికి గురిచేస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనుషుల్లాగే బాధపడుతూ అందరినీ కంటతడి పెట్టిస్తుంటాయి. ఇలాంటి హృదయ విదారక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్క పిల్ల చనిపోవడంతో తల్లి కుక్క తల్లడిల్లిపోయింది. చివరకు అది చేసిన పని చూసి ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే.కళ్ల ముందే పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. ఆ సమయంలో వాళ్ల బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. అలాగే జంతువులు కూడా తమ పిల్లల పట్ల అంతే ప్రేమను చూపిస్తుంటాయి. దురదృష్టవశాత్తు పిల్లలు చనిపోయిన సందర్భాల్లో అవి ప్రవర్తించే తీరు అందరినీ కంటతటపెట్టిస్తుంటుంది. తాజాగా, ఓ కుక్కను చూసి నెటిజన్లు అయ్యో.. పాపం....అని అంటున్నారు..