ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే, ఈ పోస్టర్లో వివేక్ పక్కన కనిపిస్తున్న ఒక కొత్త అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ అజ్ఞాత సుందరి ఎవరా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆమె పేరు ఐశ్వర్య దేశాయ్. ఇండియన్ అమెరికన్ నటి అయిన ఐశ్వర్య, గతంలో 'గల్లీ బాయ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 'ర్యాట్ ఇన్ ద కిచెన్' అనే షార్ట్ ఫిలిం ద్వారా ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా అందుకున్న ఈమె, మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా విడుదలైన పోస్టర్లో వివేక్ ఒబెరాయ్‌తో సమానమైన ప్రాధాన్యత కనిపిస్తుండటంతో, సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటి కాంచన కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'స్పిరిట్', 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Share