ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఢిల్లీ హైకోర్టు లో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ , సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరించింది.