ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంగళవారం రాత్రి చావుతప్పి కొన్నులొట్టబోయినట్లయ్యింది. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ 182 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో పంజాబ్ టీమ్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓడిపోయేలా కనిపించింది. కానీ.. లాస్ట్‌లో బౌలింగ్‌లో తలబడిన హైదరాబాద్ మళ్లీ పంజాబ్ టీమ్ పుంజుకునేలాచేసింది.
మ్యాచ్‌లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 29 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో బౌలింగ్ చేసిన హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఒత్తిడికి గురై వరుసగా వైడ్‌లు వేసి, సిక్సర్లు కూడా సమర్పించుకున్నాడు. దాంతో ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు ఇచ్చేశాడు. చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరం అవగా.. ఐదో బంతికి ఒక్క పరుగే రావడంతో ఆఖరి బంతికి సిక్స్ ఇచ్చినా హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది.
సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో సన్‌రైజర్స్ ఇంకా తప్పిదాలను దిద్దుకోవాల్సి ఉంది.