Current Date: 06 Oct, 2024

కేంద్ర బలగాలకు విజయవాడ ఎయిర్ పోర్టు

ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ కొలువుదీరాక కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధానమైన విజయవాడ విమానాశ్రయాన్ని కేంద్ర బలగాలకు  అప్పగించారు.ఏపీలోని ప్రదానమైన రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో విశాఖపట్నం తరువాత విజయవాడ కీలకమైంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అమరావతి రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. ఈ తరుణంలో విజయవాడ విమానాశ్రయం మరింత రద్దీ కానుంది. కొత్తగా విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభమౌతోంది. ఇక నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అంతా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చూసుకుంటుందని సూచిస్తూ విజయవాడ ఎయిర్‌పోర్ట్ అధారిటీ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీకు లేఖ ద్వారా సూచించారు.ఇప్పటివరకూ విజయవాడ విమానాశ్రయం సెక్యూరిటీ బాధ్యతల్ని నిర్వర్తించిన ఏపీ పోలీసుల్ని ఉపసంరించుకోవాలని డీజీపీకు కోరారు. అదే సమయంలో పాత ఎయిర్‌పోర్ట్ అధారిటీ క్వార్టర్స్ ఖాళీ చేయాల్సిందిగా సూచించారు.

Share