Current Date: 25 Nov, 2024

మల్లారెడ్డి కాలేజీకి మళ్లీ జేసీబీ.. రేవంత్ రెడ్డి రివేంజ్!

తెలంగాణలో మాజీ మంత్రి మల్లారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మళ్లీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలను వరుసబెట్టి కూల్చి వేస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆక్రమణల తొలగింపు పేరుతో మల్లారెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నాడు.నిజానికి ఈ ప్రమాదాన్ని మల్లారెడ్డి గుర్తించి ఆదిలోనే రాజీకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో అపాయింట్ మెంట్ కుదిరిందని, అన్ని విషయాలు అక్కడే తేల్చుకుంటానని ఇటీవలే చెప్పారు మల్లారెడ్డి. ఇంతలోగా ఆయనకు చెందిన మరో ప్రహరీగోడను అధికారులు జేసీబీతో తొలగించారు.పెద్ద చెరువులో ప్రహరీగోడ నిర్మించారనేది మల్లారెడ్డిపై ఉన్న ఆరోపణ. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ లోకి ప్రహరీగోడ వచ్చేసిందని, ఇది అక్రమ నిర్మాణమేనని అంటున్నారు అధికారులు. ఈ ప్రహరీని ఈరోజు కూల్చి వేశారు. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ఈ కూల్చివేతలను పర్యవేక్షించారు. చెరువులో ఉన్న మరికొన్ని నిర్మాణాలను కూడా తొలగించారు. వరుస దాడులు.. ఆమధ్య మల్లారెడ్డి విద్యాసంస్థల్లో కొన్ని నిర్మాణాలు అక్రమం అంటూ కూల్చివేతలు మొదలు పెట్టారు.