Current Date: 05 Oct, 2024

మాజీ లవర్ కేసులో రాజ్‌తరుణ్‌కి రిలీఫ్ ఇక నో అరెస్ట్!

యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా అతని మాజీ లవర్ లావణ్య పెట్టిన కేసులు, చేస్తున్న రచ్చతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజ్‌తరుణ్‌ను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రాజ్ తరణ్ తనతో ఏళ్ల పాటు సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి, అబార్షన్ చేయించాడని హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య కేసు పెట్టింది. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులివ్వగా, రాజ్ తరుణ్ హాజరవ్వలేదు. దాంతో అతడ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించాయి. కానీ రాజ్ తరుణ్‌తో పెళ్లయినట్టు ఆధారాలున్నాయా అని లావణ్య తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కనీసం పెళ్లికి సంబంధించి శుభలేఖ అయినా ఉందా? అని కోర్టు అడగ్గా  లావణ్య తరఫు లాయర్ నుంచి సమాధానం లేదు. దాంతో రాజ్‌తరుణ్‌కి వెంటనే షరతులతో కూడా ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

Share