Current Date: 05 Oct, 2024

పొటేలు కోసం రోడ్డెక్కిన హీరోయిన్ ట్విస్ట్ ఏంటంటే?

హీరోయిన్ అనన్య నాగళ్ల వింత కారణంతో రోడ్డెక్కింది. మా పొట్టేల్ తప్పిపోయింది. ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ధర్నా చేసింది. హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్ వద్ద గురువారం తమ వారితో కలిసి ప్లకార్డులు ప్రదర్శించింది. తమ పొట్టేలును పట్టిస్తే తగిన పారితోషికం ఇస్తామంటూ ఆ ప్లకార్డులలో రాసి ఉంది.3 నెలలుగా తమ పొట్టేల్ కనిపించకుండాపోయింది, మమ్మల్ని ఊర్లోకి కూడా రానివ్వడంలేదు అంటూ అనన్య ఆవేదన వ్యక్తం చేసింది. మల్లేశం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల పలు సినిమాలతో వైవిధ్యమైన నటనతో గుర్తింపు సాధించింది. ట్రెండీ డ్రెస్సులు ధరించి ఇన్‌స్టాలో పోస్టులు చేస్తూ ఉంటుంది. అలాంటి నటికి పొట్టేల్‌ ఎందుకు? అనుకోవచ్చు. అనన్య నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘పొట్టేల్’. ఈ సినిమా కోసం ఇలా వినూత్నంగా ప్రచారం చేశారు. నటించడం కాదు, జీవించేసింది.వకీల్ సాబ్, శాకుంతలం, తంత్ర, మాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, మళ్లీ పెళ్లి, అన్వేషి చిత్రాలతో నటనతో ఆకట్టుకుంది అనన్య నాగళ్ల. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య షాదీ అనే షార్ట్ ఫిల్మ్‌తో మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం యువచంద్రకృష్ణ హీరోగా సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పొట్టేల్ సినిమాలో అనన్య నాగళ్ల కథానాయికగా నటిస్తోంది.

Share