ఢల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా, రాష్ట్ర పునర్‌నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంతో పాటు, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తులు చేశారు.
Share