ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోగా.. గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడు. అనంతరం అతడిని కౌగిలించుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను పరాగ్ వేశాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది.