Current Date: 06 Oct, 2024

జలయోగతో అబ్బురపరచిన విశాఖ మహిళ డాక్టర్ గీత

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ కు చెందిన డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ నీటిలో చేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యోగా గురు ప్రభాకర స్వామి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో  డాక్టర్ గీత నీటిలో  తేలుతూ చేసిన యోగాసనాలు అందరినీ అబ్బు రపరిచాయి. డాక్టర్ గీత గతంలో కృష్ణా నదిలోను, గంగా నదిలోనూ యోగాసనాలు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హోటల్ గ్రీన్ పార్క్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Share