Current Date: 26 Nov, 2024

అదానీ మన దేశం పరువు తీస్తే.. జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారు.. వై యస్ షర్మిళ..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. పారిశ్రామిక వేత్త అదానీతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని చంద్రబాబుని ఆమె కోరారు. అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారు. అదానీ, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

Share