భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. కానీ, టెస్టుల్లో మాత్రం చాలా వెనకబడిపోయాడు. నాలుగేళ్ల ముందు వరకు కోహ్లీ ఆటను చూస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రికార్డులన్నీ గల్లంతవడం ఖాయమని అంతా భావించారు. కానీ, 2020 నుంచి ఇప్పటివరకు కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేయడం గమనార్హం.వచ్చే ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు దాదాపు 10 మ్యాచ్‌ల్ని భారత్ ఆడనుంది. సచిన్ 51 టెస్టు శతకాల రికార్డుకు కోహ్లీ (29) ఇంకా చాలా దూరంలోనే ఉన్నాడు. ఇక పరుగుల పరంగానూ దాదాపు ఏడువేలకు పైగా తేడా ఉంది. సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించడం అసాధ్యమని ఆసీస్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు.‘‘విరాట్ కోహ్లీ మునుపటి దూకుడును ప్రదర్శించలేకపోతున్నాడు. సచిన్ రికార్డుల దరిదాపులకైనా వెళ్తాడని అనుకోవడం లేదు. అతడు తన జోరును కోల్పోయాడు. గత నాలుగేళ్లుగా కోహ్లీ గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. రాబోయే పది టెస్టుల్లో భారీగా పరుగులు చేసినా.. సచిన్ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమే’’ అని వ్యాఖ్యానించాడు.
Share