ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Jul 03, 2024
దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.