Current Date: 15 Feb, 2026

దివ్యాంగురాలైన కుమార్తెకు తండ్రి ‘ఇసుక థెరపీ’

దేవుడు మరెక్కడో లేడు..తండ్రి తన పిల్లల్ని భుజాలపైకి ఎక్కించి, దేవుడ్ని చూపిస్తే..నిన్ను మోస్తున్న ఆ నాన్నే నీకు దేవుడు అంటారు పెద్దలు. విశాఖలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న శాలిపేటకు చెందిన సుబ్బారావు తన మూడేళ్ల పాప కోసం అలాగే దేవుడయ్యాడు. ఏడో నెలలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పాపకు కాస్త ఇబ్బంది ఉంటుందని వైద్యులు చూచాయిగా చెప్పేశారు. అయినప్పటికీ కానీ కన్నతీపి మమకారం అలాంటిది. డెలివరీ అయ్యి, ఆ పాపకు మూడేళ్ల వయసొచ్చినా..రోజూ ఉదయాన్నే బీచ్‌కు తీసుకొచ్చి 40నిమిషాల పాటు ఇసుకలో ఉంచి, పావుగంట పాటు స్నానం చేయిస్తే మంచిదనే వైద్యుల సూచన మేరకు  ఆ తండ్రి అలానే సేవ చేస్తున్నాడు. దివ్యాంగురాలైన తన బుజ్జాయికి ఆ తండ్రి రోజూ అలా బీచ్‌కు తీసుకు వచ్చి వైద్యుల సూచన మేరకు ఎక్సర్‌సైజ్‌లు (ఇసుక థెరపీ) చేయిస్తుండడం చూపరుల్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. తన కూతురి మెరుగైన వైద్యానికి మందులు కూడా వాడుతున్నట్టు సుబ్బారావు చెబుతున్నాడు. ఏది ఏమైనా తన చిట్టితల్లి బాగు కోసం తండ్రి పడుతున్న తపనను చూసి బీచ్ సందర్శకులు అభినందిస్తున్నారు.