ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' వేదికగా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే ఈరోజు విడుదలైన చరణ్ కొత్త మూవీ 'పెద్ది' ఫస్ట్ లుక్‌పై కూడా చిరు కామెంట్ చేశారు. పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందని, ఈ చిత్రం తప్పకుండా సినీ అభిమానులకు ఒక మంచి ట్రీట్ కానుందని చిరంజీవి అన్నారు. హ్యాపీ బర్త్‌డే మై డియర్ చరణ్. పెద్ది చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. సినిమా ప్రియులకు, అభిమానులకు ఇది ఒక విందుగా ఉంటుందని నేను కచ్చితంగా నమ్ముతున్నానని చిరు ట్వీట్ చేశారు.