Current Date: 04 Jul, 2024

ఏపీలో ఫస్ట్ రిజల్ట్ నరసాపురంలో.. లాస్ట్ భీమిలి?

ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే మొదట ఏ నియోజకవర్గం.. చివరిగా ఏ నియోకవర్గాల ఫలితాలు వస్తాయనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలను బట్టి చూస్తే.. తొలిఫలితం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వెలువడే అవకాశం ఉంది. అలానే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం, ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం ఫలితాల కోసం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.చంద్రబాబు నాయుడు (కుప్పం), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, (పులివెందుల), పవన్ కళ్యాణ్‌ (పిఠాపురం) నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మాత్రం మధ్యాహ్నానికి వెల్లడవుతాయి. జూన్‌ 4న సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు దాదాపుగా వెల్లడించి.. అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ, ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలింపు ఉంటుందన్నారు. మొత్తం ప్రక్రియను రాత్రి 9 గంటల్లోపే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేయడానికి అనుమతి లేదన్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్ 13ఏ పై అధికారి సంతకం మాత్రమే ఉండి.. ఆ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది.