Current Date: 05 Oct, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఆఖరి బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నిలిపివేత

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం మరో జనాగ్రహ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల నుంచీ బ్లాస్ట్‌ ఫర్నిస్ట్‌`3ని, అరకోరగా రన్‌ అవుతున్న బ్లాస్ట్‌ పర్నేస్‌`1ను రెండ్రోజులు క్రితం నిలిపేసిన విషయం తెలిసిందే. తాజాగా  బ్లాస్ట్‌ ఫర్నేస్‌`2ని కూడా ఆదివారం ఆపేయడంతో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు మండిపడుతున్నారు. మూడ్రోజుల పాటు షట్‌ డౌన్‌ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఉక్కు ఉత్పత్తికి కావాల్సిన కోకింగ్‌ కాల్‌ లేకపోవడం కారణాన్ని సాకుగా చూపించారు. విశాఖ పోర్టుతో పాటు సెయిల్‌ నుంచి ముడిసరకు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే ఉత్పత్తి నిలిపివేత నిర్ణయంపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు గర్భాం లీజుల్ని పొడిగించినందుకు ప్రభుత్వాన్ని కొనియాడిన సమయంలో బీఎఫ్‌`2నీ నిలిపేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు.

Share