Current Date: 06 Oct, 2024

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన దాడి ..


..
గొల్లప్రోలు, న్యూస్‌లీడర్‌, జూన్‌ 7: కాకినాడ జిల్లా పిఠాపురంలో మరో విధ్వంసం చోటు చేసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన నాయకులు, జన సైనికులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం గొల్లప్రోలు మండలం, వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు నిఘా పెంచారు.