Current Date: 27 Nov, 2024

ఏపీలో మహిళలకి ఫ్రీ బస్ ఆలస్యానికి అసలు కారణమిదే

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై కూటమి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. అందుకే అదనపు బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఖాళీలున్న డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.. ఈ మేరకు ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేల బస్సులు ఉన్నాయి.. వాటిలో సొంత బస్సులు 8,220 ఉంటే.. మిగిలినవి అద్దె బస్సులు. ఇటీవల 1,480 కొత్త బస్సుల కొనుగోలు చేయగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్‌ పూర్తిచేసుకొని డిపోలకు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే  మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. దాంతో అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. అలాగే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతోంది. 3,500 మంది వరకు డ్రైవర్‌ పోస్టులు భర్తీచేయాలని నివేదిక రూపొందించారు అధికారులు.రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు ఆర్టీసీకి రూ.250-260 కోట్ల వరకు రాబడి తగ్గుతుంది. 

Share