Current Date: 26 Nov, 2024

బామ్మార్ది రేవ్ పార్టీ వివాదం.. రంగంలోకి దిగిన కేసీఆర్?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరగకుండానే రాద్ధాంతం.. ప్రజలను దృష్టి మరల్చేందుకు దీన్ని వాడుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా తన బావ మరిది ఇంట్లో జరిగింది రేవ్‌ పార్టీ కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ శివారులోని జన్వాడ గ్రామ పరిధిలో కేటీఆర్‌ బావ మరిది రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి ఓ పార్టీ జరిగిందని సమాచారం. దీనిపై ఆదివారం ఉదయం నుంచి పోలీసులు నానా హడావుడి చేస్తున్నారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసులు రెచ్చిపోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అంతేకాకుండా కుటుంబసభ్యుల ఇళ్లపై అనుమతి లేకుండా.. నోటీసు ఇవ్వకుండా తనిఖీలు చేపట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్‌ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో తెలంగాణ డీజేపీకి నేరుగా ఫోన్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. 

Share