ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల్లో ఆయా పురపాలిక సంఘాల పరిధిలో క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. రోజువారీ కూలీలు, కార్మికులకు అన్న క్యాంటీన్లు ద్వారా ఆకలి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్లకు సంబంధించి మెనూ వచ్చేసింది. అక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందుబాటులో ఉంచుతారు. వారంలో ఆరు రోజులు ఈ క్యాంటీన్లు నడుస్తాయి. ఆదివారం మాత్రం సెలవు దినం. టిఫిన్, భోజనం రూ.5కే అందిస్తారు.