Current Date: 05 Oct, 2024

తెలంగాణలో తెరపైకి మళ్లీ బర్రెలక్క భర్తతో కలిసి అరెస్ట్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తెరపైకి వచ్చిన బర్రెలక్క అలియాస్  కర్నె శిరీషను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పికెటింగ్‌లు నిర్వహించగా.. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం గేటు ముందు బాహుబలి సినిమాలో యుద్ధం సమయంలో ఏర్పాటు చేసిన రక్షణ కవచాన్ని తలపించేలా భారీ బారేకేడ్లు ఏర్పాటు చేయటం గమనార్హం. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో కూడా తనిఖీలు చేపట్టారు.నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలిపుతూ టీజీఎస్పీఎస్సీ కార్యాలయానికి తన భర్తతో కలిసి వచ్చిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ముట్టడి నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. ఓ భార్యభర్తల జంటను ఆపేసి, ఫోన్లు లాక్కున్నారు. దీంతో.. తాము సాధారణంగా రోడ్డు వెంట వెళ్తున్నామని, ఆందోళన చేయటానికి రాలేదంటూ ఆ జంట ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. అక్కడి నుంచి పంపించేశారు.

Share