Current Date: 06 Oct, 2024

శ్రీలీల ఇలా అయిపోయిందేంటి? ఆంటీ అంటూ ఫ్యాన్స్ జోక్‌లు

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఏడాది వ్యవధిలో 7-8కి పైగా సినిమాలు చేసి బిజీగా కనిపించిన శ్రీలీల.. వరుసగా ఐదు డిజాస్టర్స్ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న సినిమాలు కూడా చేజారిపోతున్నాయి. దాంతో ఢీలా పడిపోయిన శ్రీలీల వర్కవుట్స్ మానేసిందేమో.. బొద్దుగా మారి గుర్తు పట్టలేని విధంగా తయారైంది.మొన్నటి వరకు పగలు, రాత్రి అని తేడా లేకుండా శ్రీలీల ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు షూటింగ్ లు పెట్టుకునే పరిస్థితి. కట్ చేస్తే… ఇప్పుడు ఆమె చేతిలో పెద్ద సినిమా ఏదీ లేదు. రవితేజ సరసన మరోసారి హీరోయిన్‌గా ఓకే అవగా.. ఆ మూవీ పూజ ఫొటోల్లో శ్రీలీల ను చూసిన వారు అవాక్కయ్యారు. 

Share