Current Date: 13 Aug, 2026

వాయుగుండం.. పిడుగులతో కూడిన వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయవ్య దిశగా ఝార్ఖండ్ వైపు కదులుతూ సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.