Current Date: 02 Jul, 2024

బీజేపీ మంత్రులు ఎవరు? అమిత్ షా కోసం వెయిటింగ్

ఏపీ లో కొత్త మంత్రుల జాబితా దాదాపు సిద్ధమయి పోయింది. కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీ కి ఇవ్వాల్సిన ఇద్దరి జాబితా మాత్రం పెండింగ్లో వుంది. మంగళ వారం రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విజయవాడ చేరుతున్నారు. ఆ రెండు పేర్లనూ అమిత్ షా ఖరారు చేస్తారాని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే జనసేన జాబితా సిద్ధమయింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యత లు తీసుకో బోతున్నారు. జనసేన తరపున నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, వరప్రసాద్ మంత్రి వర్గంలో ఉండొచ్చని తెలుస్తోంది.

Share